వివాహేతర సంబంధంతో ఒకరి హత్య
మెంటాడ: మండలంలోని పాడివానివలస గ్రామంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో మంగళవారం హత్య జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కూనేరు పంచాయతీ దిగువ మిర్తివలస గ్రామానికి చెందిన పెదకాపు పెదకాపు పైడితల్లికి పాడివానివలస గ్రామానికి చెందిన వివాహితతో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో పైడితల్లి మంగళవారం ఆమె ఇంట్లో ఉండగా ఆమె చిన్న కుమారుడు పి.మహేష్ చూశాడు. దీంతో రగిలిపోయిన మహేష్ పైడితల్లిని కొట్టి ఇంట్లోనే హత్య చేశాడు. హతుడు పైడితల్లి కుమార్తె యర్రజన్ని చిన్నమ్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.సీతారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. హత్య జరిగిన సంఘటనా స్థలాన్ని బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి పరిశీలించారు.


