కంకర తరలిస్తున్న వాహనాల సీజ్
సీతానగరం: మండలంలోని నిడగల్లు కొండ సమీపంలో అక్రమంగా కంకరను తవ్వి తరలిస్తున్న వాహనాలను మైనింగ్ జిల్లా ఏడీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సిబ్బంది స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు జిల్లా భూగర్భ జలవనరుల శాఖ ఏడీ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిడగల్లు రెవెన్యూ పరిధిలోని కొండ నుంచి కంకర తరలిస్తున్నారని అందిన సమాచారం మేరకు సోమవారం రాత్రి ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో తవ్వకాలు చేసి ఐదు ట్రాక్లర్లకు లోడ్ చేసి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. కంకర తవ్వకాలు చేస్తున్న ప్రాంతంలోనే జేసీబీ, లోడ్‌తో ఉన్న ఐదు ట్రాక్టర్లు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. కంకర తవ్వకాలు గుర్తించి అపరాధ రుసుం విధించినట్టు ఏడీ తెలిపారు.
కంకర తరలిస్తున్న వాహనాల సీజ్


