వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ ‘సత్య’
విజయనగరం అర్బన్: విశాఖలో ఇటీవల జరిగిన ఆంధ్ర యూనివర్సిటీ అంతర్ కళాశాలల వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ 2025 – 26పోటీల్లో ఓవరాల్ టీమ్ చాంపియన్‌ను పట్టణానికి చెందిన సత్య డిగ్రీ మరియు పీజీ కళాశాల విద్యార్థులు కై వసం చేసుకున్నారు. కళాశాల వెయిట్ లిఫ్టింగ్ టీమ్ మూడు బంగారు పతకాలు, ఒక కాంస్య పతకం సాధించి ఓవరాల్ టీమ్ చాంపియన్ షిప్ ట్రోఫిని గెలుచుకుంది. పోటీలోని 79 కేజీల విభాగంలో 105 కేజీల స్నాచ్, 135 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఆర్.రాంబాబు బంగారు పతకం, 63 కేజీల విభాగంలో 75 కేజీల స్నాచ్, 95 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఎ.యశశ్రీ బంగారు పతకం, 58 కేజీల విభాగంలో 80 కేజీల స్నాచ్, 100 కేజీల క్లీన్ అండ్ ఆర్క్ కేటగిరిలో టి.లావణ్య బంగారు పతకం, 65 కేజీల విభాగంలో 85 కేజీల స్నాచ్, 105 కేజీల క్లీన్ అండ్ జర్క్ కేటగిరిలో ఎ.లిఖిత్ కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి.సాయిదేవమణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజేతలతో పాటు కోచ్ చల్లా రామును కళాశాల యాజమాన్యం అభినందించింది.


