డిసెంబర్ 13న జాతీయ అదాలత్
విజయనగరం: డిసెంబర్ 13న జరగబోయే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత అన్నారు. ఉమ్మడి జిల్లాల న్యాయమూర్తులతో ఆమె మంగళశారం వీడియా కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజీ పడదగిన క్రిమినల్ కేసులను, మోటార్ ప్రమాద బీమా కేసులు, బ్యాంకు కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, మనీ కేసులు, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు మరియు ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ కేసులు, ఎకై ్సజ్ కేసులు, ల్యాండ్ కేసులు, కుటుంబ తగాదాలు, వాటర్ కేసులు, మున్సిపాలిటీ కేసులు, ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరిస్తామన్నారు. ఇరు పార్టీల అనుమతితో రాజీ మార్గంలో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. కాన్ఫరెన్సులో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి కె.విజయ కళ్యాణి, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి బి.అప్పలస్వామి, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎమ్.పద్మావతి, పోక్సో కోర్ట్ జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.దుర్గయ్య, ఎ.కృష్ణ ప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి మరియు కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులు పాల్గొన్నారు.


