తైక్వాండో పోటీల విజేతలకు అభినందన
● స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లాకు పతకాలు
విజయనగరం: రాష్ట్ర స్థాయిలో జరిగిన తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల 1, 2 తేదీల్లో ఏలూరులో జరిగిన అండర్–17 స్కూల్ గేమ్స్ పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు పతకాలు సాధించి విజయనగరం కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగిన పోటీల్లో నాలుగు బంగారు, రెండు వెండి, మూడు కాంస్య పతకాలు జిల్లా క్రీడాకారులు కై వసం చేసుకోవటం విశేషం. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన జిల్లా క్రీడాకారులను డీఈవో యు.మాణిక్యంనాయుడు మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, ఎస్.విజయలక్ష్మి, క్రీడాకారులు పాల్గొన్నారు.


