ఇన్ఫోసిస్‌కు జేఎన్‌టీయూ జీవీ విద్యార్థుల ఎంపిక
విజయనగరం రూరల్: ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సంస్థలో ఉద్యోగాలకు విజయనగరం జేఎన్‌టీయూ గురజాడ విశ్వవిద్యాలయానికి చెందిన 25 మంది విద్యార్థినులు ఎంపికయ్యారని ఆర్.రాజేశ్వరరావు మంగళవారం తెలిపారు. సెప్టెంబర్ 17, 18న ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో సీఎస్‌ఈ విభాగం నుంచి 12 మంది, ఐటీ విభాగం నుండి 8, ఈసీఈ విభాగం నుంచి ముగ్గురు, మెటలర్జీ, సివిల్ విభాగం నుంచి ఒక్కొక్కరు ఎంపికయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.వి.సుబ్బారావు ఉద్యోగాలకు ఎంపికై న విద్యార్థినులను వారి చూపిన ప్రతిభ, కృషి, శ్రమను కొనియాడుతూ వారి విజయాన్ని అభినందించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ జి.జయసుమ, తదితరులు అభినందించారు.


