శ్రీవిశ్వ విద్యార్థులకు కరాటేలో బ్రాంజ్ మెడల్
చీపురుపల్లి: రాష్ట్రస్థాయి కరాటే ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో చీపురుపల్లిలోని శ్రీ విశ్వ పాఠశాల విద్యార్థులు జి.యశ్వంత్, ఎం.హర్షిత్, ఎస్.చరణ్ తేజ్‌రామ్, ఎం రాజ్‌కుమార్‌లు బ్రాంజ్ మెడల్ సాధించారని ప్రిన్సిపాల్ రాజేష్ తెలిపారు.నవంబర్–2న విశాఖపట్నంలోని గాజువాకలో జరిగిన రాష్ట్రస్థాయి ఓపెన్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఈ మెడల్స్ సాధించారని అన్నారు. మెడల్ సాధించిన విద్యార్ధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
రామభద్రపురం: బాడంగి వెళ్లే రహదారిలోని చర్చి సమీపంలో రోడ్డుపై ఉన్న పెద్ద గుంతలో ఆదివారం ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలైన విషయం తెలింసిందే. వారిలో ఓ మహిళ విశాఖపట్టణంలోని కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. బాడంగి మండలం పూడివలసకు చెందిన బోను గౌరమ్మ మెంటాడ మండలం పోరాం గ్రామానికి చెందిన కన్నంనాయుడు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు కింద పడగా ఇద్దరికీ గాయాలయ్యాయి. గౌరమ్మను మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఏఎస్సై అప్పారావు కేసునమోదు చేశారు.
శ్రీవిశ్వ విద్యార్థులకు కరాటేలో బ్రాంజ్ మెడల్


