కలెక్టర్‌కు జిల్లా అధికారుల సత్కారం
విజయనగరం అర్బన్: సమన్వయంతో, సమష్టిగా కృషి చేసినప్పుడే సత్ఫలితాలను సాధించవచ్చని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి స్పష్టం చేశారు. మోంథా తుఫానును ఎదుర్కొనడంలో జిల్లా యంత్రాంగాన్ని సమర్థవంతంగా నడిపించి అన్ని విధాలుగా ముందు జాగ్రత్త చర్యలను చేపట్టి నష్టాన్ని గణనీయంగా నివారించిన కలెక్టర్ రామ్‌సుందర్‌రెడ్డి ముఖ్యమంత్రి నుంచి ప్రత్యేకంగా అభినందనలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ను, జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధన్‌ను సోమవారం గ్రీవెన్స్ సెల్‌లో జిల్లా ముఖ్య ప్రణాళికాధికారి పి.మురళి ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుఫాన్‌ను ఎదుర్కోనడంలో జిల్లా అధికారుల నుంచి సచివాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ సహకరించారని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సహకారం, సమన్వయంతో ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్‌ను రాష్ట్రస్థాయి మోంథా అవార్డు గ్రహీతలైన ఇరిగేషన్ ఈఈ వెంకటరమణ, వీఆర్వో రాజ్ మోహన్, ఆశ వర్కర్ బంగారమ్మలను ఈ సందర్భంగా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


