వరిచేను వెన్ను విరిగింది
మెరకముడిదాం మండలంలో మొత్తం 267 ఎకరాలు వరకు వరింపంట మోంథా తుఫాన్ ప్రభావంతో నీట మునిగింది..త్వరలో కోతలు అవుతాయని అనుకున్నాం కానీ ఇలా అవుతుందని అనుకోలేదని సోమలింగాపురం గ్రామానికి చెందిన ఆబోతుల అప్పారావు చెబుతున్నారు. ఎకరాకు సుమారు రూ. 20,000 నుంచి రూ.30,000 మదుపులు పెట్టి సాగు చేశాం. గింజ గట్టిపడి పంట చేతికి అందాల్సిన తరుణంలో పొలంలో నీరు చేరిపోయింది. చేను ఒరిగిపోయింది. ఇక గింజ నాణ్యత తగ్గిపోతుంది. తాలు గింజలు వస్తాయి.. రంగు మారిపోతుంది.. ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారో.. ప్రభుత్వం నుంచి అయితే సాయం వచ్చే అవకాశం కనిపించడం లేదు.
– ఆబోతుల అప్పారావు, సోమలింగాపురం


