భావితరాల భవిష్యత్ కోసం.. ఓ సంతకం
విజయనగరం రూరల్: తేవయ్యా.. సంతకం చేస్తా: మలిచర్లలో సంతకం చేస్తున్న మహిళ
ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్యస్పందన లభిస్తోంది. ప్రజలకు వైద్యం, పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు వైద్యవిద్యను దూరంచేసే కూటమి ప్రభుత్వ కుతంత్రాలను నిరసిస్తూ.. భావితరాల భవిష్యత్తు కోసం తాము సైతం అంటూ పల్లె, పట్టణ ప్రజలు సంతకాలు చేస్తున్నారు. ప్రభుత్వ వ్యవస్థలను కాపాడాలని కోరుతున్నారు. ఈ పోరాటంలో వైఎస్సార్‌సీపీకి అండగా ఉంటామని సంతకంతో భరోసా ఇస్తున్నారు. దీనికి పలు పల్లెలు, పట్టణాల్లో సోమవారం కనిపించిన ఈ చిత్రాలే సజీవ సాక్ష్యం.
– సాక్షినెట్‌వర్క్
భావితరాల భవిష్యత్ కోసం.. ఓ సంతకం


