రాజరాజేశ్వరి దేవికి కిరణ స్పర్శ
బొండపల్లి: మండలంలోని దేవుపల్లి గ్రామంలో ఉన్న రాజరాజేశ్వరిదేవి అమ్మవారిని కార్తీక సోమవారం భానుడి లేలేత కిరణాలు స్పర్శించాయి. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు ఆలయానికి క్యూ కట్టారు. అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు.
గడువులోగా అర్జీలు పరిష్కరించాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం అర్బన్: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను గడువులోపలే పరిష్కరించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ అర్జీల ఆడిట్‌పై సోమవారం సమీక్షించారు. ప్రీ ఆడిట్‌లో ప్రవర్తనాపరమైన లోపాలు, పద్ధతిని అనుసరించే విధానంపై కలెక్టరేట్ కాల్ సెంటర్ నుంచి ఆడిట్ టీమ్ అర్జీదారులతో మాట్లాడి ఫోన్‌లో తెలుసుకుంటుందని, వారు చెప్పిన విషయాలను వాస్తవంగా నమోదు చేయాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు వారంలో నాలుగు సచివాలయాలను సందర్శించాలని, అర్జీదారుల పరిష్కారంపై ఆరా తీయాలన్నారు. రెండు శాఖల వద్ద గడువుదాటి ఉన్న అర్జీలను పరిష్కరించేలా చూడాలన్నారు. సమావేశంలో జేసీ సేతుమాధవన్, ఆర్డీఓ శ్రీనివాసమూర్తి, పీజీఆర్‌ఎస్ నోడల్ అధికారి మురళి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాజరాజేశ్వరి దేవికి కిరణ స్పర్శ


