నిట్టనిలువునా కూల్చేసింది..
బొప్పాయి తోటలను 30 ఎకరాల్లో సాగుచేశాను. రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. ఇంకో నెలలో కోతకు వస్తుందనుకున్న బొప్పాయి తోటను మోంథా తుపాను నిట్టనిలువునా కూల్చే సింది. నిండాకాయలతో చెట్లు నేలకూలాయి. ఇంకో నెలలో కాయలు పక్వానికి వస్తాయి.. బెంగాల్.. ఒడిశా.. నుంచి వ్యాపారాలు వచ్చి కిలో రూ.12 చొప్పున కొటారు. ఖర్చులు పోను ఎకరాకు ఒక లక్ష అయినా మిగులుతుంది.. అప్పులు తీరుతాయి.. వచ్చే సీజన్‌కు మళ్లీ పెట్టుబడికి ఢోకాలేదనుకున్నా. ఆశలన్నీ గల్లంతయ్యాయంటూ చీపురుపల్లి మండలంలోని పేరిపి గ్రామానికి చెందిన లెంక రాజారావు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నేలకూలిన తోటలో కూర్చుని కన్నీటిపర్యంతమవుతున్నారు. మొదళ్లవద్ద వర్షపు నీరు చేరిందని, ఉన్న చెట్లు కూడా చనిపోతాయంటూ ఆవేదన వ్యక్తంచేశాడు. ప్రభుత్వం ఆదుకోకుంటే అప్పుల్లో కూరుకుపోతానంటూ గగ్గోలు పెడుతున్నాడు.


