ఇసుక స్టాక్ పాయింట్ పరిశీలన
● ఇసుక దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు
బొబ్బిలి: గ్రోత్ సెంటర్‌లోని ఇసుక స్టాక్ పాయింట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న అంశంపై సాక్షి పత్రికలో శనివారం అక్రమ ఇసుక రవాణ అన్న కధనాన్ని ప్రచురించింది. దీనికి స్పందించిన ఆర్డీవో జెవివిఎస్.రామ్మోహనరావు, తహసీల్దార్ ఎం.శ్రీను, ఆర్‌ఐ రామకుమార్, ఎస్‌ఐ జ్ణానప్రసాద్ ఇసుక స్టాక్ పాయింట్‌ను పరిశీలించారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఇసుకను అక్కడి నుంచి అక్రమంగా తరలించినట్టు స్థానికులు చెబుతున్నారని, మధ్యాహ్న సమయంలోనే ఇసుక రవాణా జరిగినట్టు సమాచారం అందిందన్నారు. అధికారులంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనల్లో బిజీగా ఉండగా ఇక్కడ ఇసుక స్టాక్ పాయింట్ నుంచి జేసీబీ సహాయంతో 7 ట్రాక్టర్ల ఇసుకను తరలించినట్టు గుర్తించామని తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని తహసీల్దార్ ఎం.శ్రీను తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా వైర్లును కత్తిరించారని దీనివలన ఎవరన్నది గుర్తించలేకపోయామని, త్వరలో పట్టుబడతారని వివరించారు. ప్రభుత్వ ఇసుక స్టాక్ పాయింట్లో ఇసుక అక్రమంగా తరలించిన వారెవరైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తిని దోపిడి చేసినట్లేనని స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నామని, పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారని తహసీల్దార్ తెలిపారు.
ఇసుక స్టాక్ పాయింట్ పరిశీలన


