యోగా పోటీల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు కాంస్య పతకం
పార్వతీపురం రూరల్: అమరావతిలోని విట్ ఇండోర్ స్టేడియంలో అక్టోబర్ 13 నుంచి 17 వరకు జరిగిన 2వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ ఆర్టిస్టిక్ యోగా పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లా ఏఆర్ విభాగానికి చెందిన మహిళా కానిస్టేబుల్ వై. మధుబాల అద్భుత ప్రతిభ కనబరిచారు. సీనియర్ మహిళల ‘ఎ’ విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పాల్గొన్న ఆమె, కాంస్య పతకాన్ని కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి, జిల్లాకు పేరు తెచ్చిన మధుబాలను ఎస్పీ ఘనంగా సత్కరించి, అభినందించారు. మున్ముందు కూడా రాష్ట్రాన్ని, పోలీసు శాఖ ఖ్యాతిని పెంచేలా విజయాలు సాధించాలని ఎస్పీ ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్‌ఐలు నాయుడు, రాంబాబు పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్ అయిన గది పరిశీలన
గుర్ల: మండల కేంద్రంలోని కేజీబీవీ డార్మిటరీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో విద్యార్థులు వినియోగిస్తున్న బెడ్స్ కాలిపోయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు షార్ట్ సర్క్యూట్ అయిన గదిని చీపురుపల్లి డీఎస్పీ ఎస్. రాఘవులు, ఆర్‌జేడీ భాస్కరరావు బుధవారం పరిశీలించారు. అస్వస్థతకు గురై చికిత్స పొందిన విద్యార్థులను పరామర్శించి ప్రమాదం ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. గోడలో విద్యుత్ వైర్లు సర్క్యూట్ అవడమే ప్రమాదానికి కారణమని గుర్తించినట్లు ఏసీఓ ఎ.రామారావు తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పాఠశాలలో ఉన్న కార్బన్ డై ఆకై ్సడ్ ట్యాంక్‌లను వినియోగించాలని అవగాహన కల్పించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్ కేసలి అప్పారావు బాలికలను పరామర్శించారు.
యోగా పోటీల్లో ఏఆర్ కానిస్టేబుల్‌కు కాంస్య పతకం


