ఆశ్రమపాఠశాలను సందర్శించిన ఎంపీడీవో
మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస ఆశ్రమపాఠశాలను ఎంపీడీవో అర్జునరావు మంగళవారం సందర్శించారు. ‘సమస్యల వసతిలో చదువుల పోరాటం’ బురదలోనే భోజనా నికి..అన్న కథనాలు సాక్షిలో మంగళవారం వెలువడిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈమేరకు కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో అర్జునరావు ఆశ్రమపాఠశాలను సందర్శించి, మధ్యాహ్నభోజన వంటకాలను, డార్మిటరీని పరిశీలించారు. అనంతరం అనసభద్ర గ్రామం సమీపంలోని ఏకలవ్య పాఠశాలను ఎంపీడీవో సందర్శించి, తుఫాన్ ప్రభావంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు బయటకు వెళ్లరాదని, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మండల ఇంజినీరింగ్ అధికారి రంజిత్, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం ఎం.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఆశ్రమపాఠశాలను సందర్శించిన ఎంపీడీవో


