అప్రమత్తంగా ఉండాలి
గంట్యాడ: గోస్తనీ నదీ పరివాక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దామోదర్ సూచించారు. తాటిపూడి గ్రామంలో ఉన్న గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలశయాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. జలాశయం గరిష్ట నీటిమట్టం, ముంపు గ్రామాల వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటిని విడుదల చేసే సమయంలో జలాశయం పరిధిలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని కోరారు. ఉద్దేశ పూర్వకంగా అసత్యాలను ప్రచారం చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎస్పీ గోవిందరావు, ఎస్బీ సీఐ బి.లీలారావు, రూరల్ సీఐ లక్ష్మణరావు, ఎస్.సాయికృష్ణ, తహసీల్దార్ నీలకంటేశ్వర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


