కంపుకొడుతున్న కలెక్టరేట్
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ప్రతి మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’ కలెక్టరేట్ ప్రాంగణంలో కానరావడంలేదు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తున్న కార్యక్రమం జిల్లాకు వెన్నెముకగా నిలిచే కలెక్టరేట్‌లో నిర్వహించకపోవడం విమర్శలకు తావిస్తోంది. కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపు 40 వరకు ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. ఆయా శాఖల కార్యాలయాల్లో జిల్లా అధికారులతో పాటు విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ఐదు వందలకు పైబడి ఉన్నారు. వీరితోపాటు ఆయా శాఖల్లో అధికారులను కలిసేందుకు జిల్లా ప్రజలు ప్రతిరోజూ వస్తుంటారు. విధుల్లో ఉపయోగించే కాగితాల, ప్లాస్టిక్ బాటిళ్లు, పాతఫైళ్లు తదితర వ్యర్థాలను చతురాకార కార్యాలయాల సమూహం మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పడేస్తున్నారు. వీటిని సకాలంలో తొలగించకపోవడంతో ప్రాంగణం ‘డంపింగ్ యార్డ్’ను తలపిస్తోంది. మరోవైపు కలెక్టరేట్‌లో ఉన్న అరకొర మరుగుదొడ్లు సిబ్బందికి సరిపడడంలేదు. అత్యవసర వేళ మరుగుదొడ్డికి వెళ్లాలంటేనే ఉద్యోగులు భయపడే పరిస్థితి నెలకుంది. ఇదే విషయంపై కలెక్టరేట్ నిర్వాహక అధికారులు స్పందిస్తూ ప్రాంగణ శుభ్రతపై కొన్ని శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ వాపోయారు. ఇప్పటికే వ్యర్థాలు తొలగించాలని సంబంఽధిత శాఖలకు నోటీసులు ఇచ్చామని, త్వరలో ప్రాంగణాన్ని పూర్తిగా శుభ్రం చేస్తామన్నారు.
డంపింగ్ యార్డును తలపిస్తున్న కలెక్టర్ కార్యాలయ పరిసరాలు
కలెక్టరేట్‌లో కానరాని
‘స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’
మరుగుదొడ్లు అంతంతమాత్రమే..
అపరిశుభ్రతతో ఉద్యోగులకు తప్పని ఇబ్బందులు
కంపుకొడుతున్న కలెక్టరేట్


