
గృహప్రవేశాలకు సిద్ధంగా ఉండాలి
విజయనగరం అర్బన్: పీఎంఏవై పథకం కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. పీఎంఏవై కింద జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1,386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్‌లో సొంత స్థలాలు ఉన్న వారి గృహాలను పూర్తి చేయాలన్నారు. రూఫ్ లెవెల్‌లో ఆర్‌సీ స్థాయిలో ఉన్నవి పూర్తి కావాలని ఇకపై ప్రతి వారం సమీక్షించనున్నట్లు తెలిపారు. కాలనీలలో నిర్మాణాలకు అనువుగా ఉన్న వాటిని గుర్తించి అందుకు ఎంతమేరకు భూమి అవసరం అవుతుందో ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ మురళీ ప్రసాద్, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.రామ్ సుందర్‌రెడ్డి