
మత్తు వైద్యులకు గుర్తింపు వచ్చింది:
గతంలో మత్తు వైద్యులకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. తెరవెనుకనే వారి పాత్ర ఉండేది. కోవిడ్ రోగులకు సేవలు అందించిన తర్వాత మత్తు వైద్యులకు ప్రాధాన్యం, గుర్తింపు వచ్చింది. గతంలో మత్తు వైద్యులుగా చేయడానికి చాలా మంది వెనుకాడేవారు. రోగికి ఏదైనా అయితే నిందిస్తారేమోనని ముందుకు వచ్చేవారు కాదు. కానీ ఇప్పడు మంచి పరికరాలు అందుబాటులోకి రావడం వల్ల మత్తు వైద్యుల పని సులభతరమైంది. మత్తు ఇవ్వడం కష్టతరమైన పని అయినప్పటికీ రోగుల ప్రాణాలు కాపాడామనే సంతృప్తి ఉంటుంది.
డాక్టర్ డి.జయధీర్‌బాబు, ప్రొఫెసర్, మత్తు విభాగం అధిపతి , ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి