
‘శౌర్యం స్మృతి’ బ్రోచర్ల ఆవిష్కరణ
విజయనగరం క్రైమ్: పోలీస్ అమరవీరుల స్మారక వారోత్సవం సందర్భంగా, విజయనగరం జిల్లా పోలీసు డివిజన్ పరిధిలో పోలీస్ శాఖ చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘శౌర్యం‘ (తెలుగు) ‘స్మృతి‘ (ఆంగ్లం) పేరుతో రూపొందించిన అమరవీరుల స్మారక బ్రోచర్లను ఎస్పీ ఏఆర్ దామోదర్ బుధవారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ‘అమరవీరుల సేవా తపస్సుకు ఈ సాహిత్య నివాళి ప్రతి పోలీసు సిబ్బందిలో ధైర్యస్ఫూర్తిని నూరిపోస్తుందన్నారు. అమరవీరుల కుటుంబాలకు గౌరవాన్ని చాటుతుందని చెప్పారు. ఈ ప్రయత్నం రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాస్థాయి పోలీసు విభాగం ఆధ్వర్యంలో అధికారికంగా ప్రారంభం కావడం విశేషమన్నారు.. భవిష్యత్‌లో ఇది తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ప్రేరణారూపంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ప్రముఖ యాంకర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.