నేడు తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌

Oct 13 2025 6:08 AM | Updated on Oct 13 2025 6:08 AM

నేడు

నేడు తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌

నేడు తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌ ● పెద్ద చెరువులో తెప్పోత్సవం రేపు 4వేల క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని తెలుసుకోవాలి ● ఐఎంఏ సీజీపీ డీన్‌ డాక్టర్‌ వి.ఎస్‌.ప్రసాద్‌

విజయనగరం టౌన్‌: హంస వాహనంపై పైడితల్లి అమ్మవారు విహరించేందుకు తెప్పోత్సవ ఏర్పాట్లను ఆలయ అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. ఈ మేరకు సోమవారం ఉదయం పెద్ద చెరువులో తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష తెలిపారు. 30 మంది గజ ఈతగాళ్లతో, హంస వా హనం, రెండు పక్క బోట్లుతో పాటూ అగ్నిమాపక అధికారుల బోట్లు ఉంటాయన్నారు. హంస వాహనిపై విహరించే పైడితల్లి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు తరలివచ్చే అశేష భక్త జనావళికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామ న్నారు. ఆర్‌అండ్‌బీ అధికారుల సాయంతో వేసిన గ్రిల్స్‌ వరకూ వచ్చి తెప్పోత్సవాన్ని చూసే అవకాశం కల్పించామన్నారు. పెద్దచెరు వు అవతలి గట్టు నుంచి కోటశక్తి ఆలయం వర కూ తెప్పోత్సవాన్ని వీక్షించే అవకాశం ఉందన్నారు. మూడుసార్లు అమ్మవారు పెద్ద చెరువు లో హంస వాహనంపై విహరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తారని తెలిపారు. ట్రయల్‌ రన్‌ సుమా రు 50 మందితో నిర్విహిస్తామని, కానీ ఉత్సవానికి మాత్రం 20 మంది వరకే అనుమతి ఉందన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంట ల నుంచి నిర్వహించనున్న తెప్పోత్సవాన్ని భక్తులందరూ వీక్షించి తరించాలని కోరారు.

వంగర: మండల పరిధి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు వద్ద 4 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఆదివారం నమోదైంది. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 4వేల క్యూ సెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరడంతో ప్రాజెక్టు వద్ద 64.12 మీటర్లు లెవెల్‌ నీటిమట్టం నమోదైంది. వచ్చిన నీటిని రెండు గేట్ల ద్వారా దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్‌ తెలిపారు.

విజయనగరం అర్బన్‌: కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రె డ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖల జిల్లా అధికారులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కా ర వేదికకు తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాల ని సూచించారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించి స్లిప్పును తీసుకురావాల ని సూచించారు. జిల్లా ప్రజలు పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విజయనగరం ఫోర్ట్‌: సమాజంలో ఎప్పటికప్ప డు వచ్చే అధునాతన వైద్య పరిజ్ఞానాన్ని వైద్యు లు తెలుసుకోవాలని ఐఎంఏ సీజీపీ డీన్‌ డాక్టర్‌ వి.ఎస్‌.ప్రసాద్‌ అన్నారు. ముంబాయిలోని ఐటీసీ హోటల్‌లో నిర్వహించిన వెస్ట్‌ జోన్‌ జాతీయ వైద్యుల సమ్మేళనంలో విజయనగరానికి చెందిన ప్రసాద్‌ పాల్గొని మాట్లాడారు. సేవాదృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ జాతీ య అధ్యక్షుడు డాక్టర్‌ దిలీప్‌ భానుపాళి, ఉపా ధ్యక్షుడు కపాడియా, కోశాధికారి పీయూష్‌ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు పింఛన్‌దారుల సమావేశం

పార్వతీపురం: పట్టణంలోని రైతు బజారు పక్కన వున్న విశ్రాంత ఉద్యోగుల భవనంలో సోమవారం పింఛన్‌దారులతో సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గంట జగన్నాధంనాయుడు, కార్యదర్శి గణపతిరావు ఆదివారం తెలిపారు. సమావేశంలో మండల యూనిట్ల నిర్వాహణ, భవిష్యత్‌ ప్రణాళికపై చర్చించనున్నట్టు పేర్కొన్నారు. పింఛన్‌దారులు హాజరు కావాలని కోరారు.

నేడు తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌ 1
1/1

నేడు తెప్పోత్సవం ట్రయల్‌ రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement