
అంతరిక్షంలో జీవనం సాధ్యమే
లైవ్ డ్రెస్‌డ్ స్కిన్‌లెస్ శ్రీ147 శ్రీ264 శ్రీ274
చికెన్
బొబ్బిలి: మన ప్రయోగాలు, పరిశోధనల సారాంశం సరికొత్త దశలోకి వెళ్తోందని, ఇప్పుడు అంతరిక్షంలో ప్రయాణమే కాదు అక్కడ మానవ జీవనమూ సాధ్యమేనన్న రీతిలో సరికొత్త ఆవిష్కరణలు భవిష్యత్తులో జరగనున్నాయని శ్రీహరి కోట మూడవ లాంచ్ ప్యాడ్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.శ్రీనివాస రావు అన్నారు. గడిచిన మూడు రోజులుగా స్థానిక రాజా కాలేజ్‌లో ఇస్రో ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అంతరిక్షంలో మన ప్రయోగాలు, పరిశోధనల విషయమై స్థానిక విలేకర్లతోనూ మాట్లాడారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలిసారి చంద్రమండలంపై అడుగుపెట్టినప్పుడు చెప్పిన ఈ చిన్న అడుగే పెద్ద దూకుడవుతుందన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయన్నారు. మనదేశం కూడా ఈ రంగంలో ఆసాధారణ ప్రయాణం చేస్తోందన్నారు. 1969లో చిన్న ఆఫీసులో ప్రారంభమైన ఇస్రో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత నమ్మదగిన అంతరిక్ష సంస్థ అయిందన్నారు. మన చంద్రయాన్ మిషన్లు చంద్రుడిపై నీటి ఆనవాళ్లు కనుగొన్నాయని తెలిపారు. మంగళయాన్ మిషన్ రెడ్ ప్లానెట్ చేరిన మొదటి ఆసియా దేశంగా మన దేశాన్ని ముందు నిలిపిందన్నారు. ఆదిత్య–ఎల్1 అనేది సూర్యుడ్ని పరిశీలిస్తూ భూమిని రక్షించే కీలక ఉపగ్రహంగా నిలిచిందన్నారు. ఇప్పుడు గగన్‌యాన్ మన దేశ అంతరిక్ష పరిశోధనను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయన్నారు. భూమి సహాయం లేకుండా అంతరిక్షంలో శ్వాస తీసుకోవడం, నీరు తాగడం, ఆహారం పొందడం, శక్తిని ఉత్పత్తి చేయడం వంటి ఎన్నో చర్యలను త్వరలో చేపట్టేందుకు అవకాశం ఉందన్నారు. భారత దేశానికి స్వంత అంతరిక్ష కేంద్రం (భారతీయ అంతరిక్ష కేంద్రం)2040 నాటికి సాధ్యపడుతుందన్న భావన వ్యక్తం చేశారు. ఇందుకోసం మన దేశం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. రాజా కళాశాల చైర్మన్ ఆర్‌వీఎస్‌కే రంగారావు మాట్లాడుతూ కాలేజీలో చేపట్టిన ప్రదర్శనలు, ప్రయోగాల నమూనాల ఆధారంగా ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ప్రయోగాల్లో వాటికి సంబంధించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఇస్రో నిర్వాహకులు టి.హరికృష్ణ, ఈ ప్రదీప్‌నాయుడు, ప్రిన్సిపాల్ సీహెచ్ వీరేంద్రకుమార్, అధ్యాపకులు, వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
శ్రీహరికోట షార్ పీడీ పి.శ్రీనివాసరావు

అంతరిక్షంలో జీవనం సాధ్యమే