
డీపీఓలో పోలీస్ వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్ : జిల్లా ఎస్పీగా ఎ.ఆర్.దామోదర్ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారిగా తన చాంబర్‌లో శుక్రవారం పోలీస్ వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం పది మంది సిబ్బంది తాము అనుభవిస్తున్న, చెప్పుకోలేని, వృత్తి పరంగా, శాఖా పరంగా పడుతున్న బాధలను, సమస్యలను ఫిర్యాదుల రూపంలో వ్యక్త పరిచారు. జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ విజ్ఞాపనలు స్వీకరించి, పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, శాఖ సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు.
పోలీసుల సంక్షేమమే ప్రథమ కర్తవ్యం
పార్వతీపురం రూరల్: నిరంతరం ప్రజారక్షణ విధుల్లో నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది సంక్షేమానికి, శాఖాపరమైన సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
(గ్రీవెన్స్‌డే) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న వివిధ హోదాల్లోని అధికారులు, సిబ్బంది తమ వృత్తిపరమైన, ఆరోగ్య, వ్యక్తిగత సమస్యలను ఎస్పీకి నేరుగా విన్నవించుకున్నారు. ఈ క్రమంలో వారి సమస్యలను తెలుసుకున్న ఎస్పీ అక్కడకక్కడే కొన్ని సమస్యలకు సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. అలాగే మరికొన్ని సమస్యలపై త్వరలోనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసులు మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉన్నప్పుడే మెరుగైన సేవలు అందించగలరని, వారి సంక్షేమానికి ఎప్పుడు అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీసీ సంతోషికుమార్ తదితరులున్నారు.
సమస్యలు ఏకరువు పెట్టిన సిబ్బంది

డీపీఓలో పోలీస్ వెల్ఫేర్ డే