
పోలీస్‌స్టేషన్లను తనిఖీ చేసిన ఎస్పీ
విజయనగరం క్రైమ్: విజయనగరం సబ్ డివిజన్ పరిధిలోని భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ పోలీస్‌స్టేషన్‌లను ఎస్పీ దామోదర్ బుధవారం తనిఖీ చేశారు. స్టేషన్‌లలో పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను కొత్త చట్టాల నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన డిస్పోజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే డయల్ – 100, 112 కాల్స్ యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయాలని, వాటికి వచ్చిన ఫిర్యాదులు పరిశీలించి తక్షణమే ఘటన స్థలానికి చేరుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల్లో వృద్ధులు, మహిళల పట్ల సామరస్య పూర్వకంగా, అప్యాయంగా మాట్లాడి సమస్యలకు పరిష్కారం సాధ్యమైనంత వరకు చూపాలన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌తో ప్రజలకు మెరుగైన సేవలందించాలని అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీని సిబ్బంది వినియోగించుకోవాలన్నారు. గంజాయి అక్రమ రవాణ, మహిళలపై అసభ్యంగా ప్రవర్తించే వారి పట్ల, బాల బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. తొలుత భోగాపురం పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసర ప్రాంతాలను సీఐ దుర్గాప్రసాద్ ఎస్పీకి దగ్గరుండి చూపించారు. అనంతరం భోగాపురం స్టేషన్‌లో తనిఖీ చేశారు. అక్కడున్న ఎస్‌హెచ్‌వో దుర్గాప్రసాద్ ఎస్పీకి క్షుణ్ణంగా సిబ్బంది వ్యవహరిస్తున్న పనితీరును వివరించారు. అనంతరం డెంకాడ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. స్టేషన్ హెచ్‌వో సన్యాసినాయుడును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ రామకృష్ణ, ఎస్‌ఐలు పాపారావు, సూర్యకుమారి తదితరులు ఉన్నారు.