
కొనసాగిన ఉపాధ్యాయుల నిరసన వారం
విజయనగరం అర్బన్: ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 17వ తేదీ వరకు నిర్వహించనున్న నిరసన వారం కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ఎదుట ఉపాధ్యాయులు నిరసన నినాదా ల కార్యక్రమం చేపట్టారు. అనంతరం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇంటికి వెళ్లి ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్‌లను పరిష్కరించాలని కోరారు. ఇంతవరకు పెండింగ్‌లో ఉన్న 4 డీడీలు విడుదల చేయాలి. సీపీఎస్ రద్దు, ఐఆర్ (ఐఆర్) ప్రకటన, బకాయిల చెల్లింపు హెల్త్ కార్డు పరిమితి పెంపు, అసెస్మెంట్ బుక్‌లెట్ విధానం రద్దు తదితర డిమాండ్‌లు పరిష్కరించాలని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ కర్రి రవి, జిల్లా అధ్యక్షుడు షేక్ బుకారీ బాబూ, ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిలర్ కర్రి రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు మజ్జి రమేష్, మార్రాపు శ్రీనివాస్, కె.వెంకునాయుడు, టి.శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, సుగుణాకరరావు, పి.సత్యన్నారాయణ కె.వెంకటరావు పాల్గొన్నారు.
మంత్రి కొండపల్లికి వినతి