
ఆరికతోటలో జిల్లా స్థాయి జూడో జట్ల ఎంపికలు
రామభద్రపురం: మండలంలోని ఆరికతోట ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిలాస్థాయి అండర్ 14,17,19 బాలికలు, బాలుర జూడో జట్ల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపిక జిల్లా జూడో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బి.రత్నకిషోర్, అండర్ 19 జిల్లా ఎస్‌జీఎఫ్ పరిశీలకుడు సీహెచ్ రాజేష్ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి.ఈ పోటీలో జిల్లాలోని 25 పాఠశాలల నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొనగా సర్పంచ్ పెంకి పుష్పమ్మ, ఎంఈవో తిరుమల ప్రసాద్ పోటీలను ప్రారంభిచారు. అలాగే అండర్ 14 విభాగంలో బాలికలు ఏడుగురు, బాలురు ఏడుగురు చొప్పున ఎంపిక చేయగా అండర్ 17 విభాగంలో బాలికలు 9 మంది, బారులు 9 మంది, అండర్ 19 విభాగంలో బాలికలు 9 మంది, బాలురు 9 మంది చొప్పున ఎంపిక చేసి మొత్తం 50 మందిని రాష్ట్రస్థాయి జూడో పోటీలకు పంపిస్తున్నట్లు తెలిపారు.ఈ పోటీలను ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి పర్యవేక్షించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జి.కృష్ణవేణి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం కార్యదర్శి నల్ల వెంకటనాయుడు, వైస్ ఎంపీపీ ప్రతినిధి పెంకి శేఖర్, పీడీలు వి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.