
గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పిస్తాం
● జిల్లా ప్రజా రవాణా అధికారి
● డయల్ యువర్ డీపీటీఓకు 26 వినతులు
పార్వతీపురంటౌన్: జిల్లాలోని పల్లెలు, గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడానికి కృషి చేస్తామని జిల్లా ప్రజా రవాణాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రజా రవాణాధికారి కార్యాలయంలో నిర్వహించిన డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమానికి 26 వినతులు ఫోన్ ద్వారా వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారులను సంప్రదించి సాధ్యమైనంత వరకూ పల్లెలకు, శివారు గ్రామాలకు బస్సు సౌకర్యం అలాగే స్టాపుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు.