
చిత్తశుద్ధితో విధులు నిర్వహించాలి
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం: ఉద్యోగులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించి సమాజానికి ఉత్తమ సేవలందించాలని జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. జెడ్పీ పరిధిలో ఉద్యోగోన్నతి పొందిన వారికి నియామక పత్రాలను తన చాంబర్‌లో శుక్రవారం అందజేశారు. బొండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రికార్డు అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తూ బుడతనాపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల జూనియర్ సహాయకుడిగా నియామకమైన ఎస్.షఫీని అభినందించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, డిప్యూటీ సీఈఓ ఆర్.వెంకట్‌రామన్, ఏఓ రాజేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.