
పత్రికా స్వేచ్ఛపై దాడి అమానుషం
ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో పత్రికలు కీలకపాత్ర పోషిస్తాయి. పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం వ్యవహరించడం తగదు. ఓ నాయకుడి ప్రెస్‌మీట్ వార్తను యథాతథంగా ప్రచురించినా కేసులు పెట్టడం విచాకరం. పోలీస్ వ్యవస్థలో పదోన్నతుల విషయంలో జరిగిన అక్రమాలపై వార్తను ప్రచురించిన ‘సాక్షి’పై కక్ష కట్టడం ఎంతవరకు సమంజసం. ఎడిటర్, బ్యూరో ఇన్‌చార్జిలపై కేసులు పెట్టడం, విచారణ పేరుతో వేధించడం సరి కాదు. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వమూ చేపట్టని తీరు ఇది. పత్రికా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం సంకెళ్లువేయాలని చూస్తోంది. పత్రికల్లో ప్రచురితమైన కథనాల్లో అభ్యంతరాలుంటే తెలియజేయాలే తప్ప పోలీస్ కేసులు పెట్టడం సరికాదు.
– బెల్లాన చంద్రశేఖర్,
మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్

పత్రికా స్వేచ్ఛపై దాడి అమానుషం