
రైతన్నకు మద్దతుగా నిలబడదాం
● శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ
● వైఎస్సార్‌సీపీ శ్రేణులకు దిశానిర్దేశం
చీపురుపల్లిరూరల్ (గరివిడి): రాష్ట్రంలో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాటం సాగించాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మాజీ మంత్రి, శాసనమండలి విపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గరివిడిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌తో పాటు నియోజకవర్గంలోని చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం మండలాలకు చెందిన నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలతో మమేకయ్యారు. గ్రామాల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. రైతుల ఎరువు సమస్యపై ఆరా తీశారు. యూరియా కొరతపై రైతుకు వెన్నుదన్నుగా పోరాటం సాగిద్దామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9న యూరియా కొరతపై రైతుకు మద్దతుగా చీపురుపల్లిలో జరిగే పోరాటానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ పోరాటం వల్లే దివ్యాంగుల పింఛన్ల తొలగింపునకు నోటీసులిచ్చినా పింఛన్లు అందజేసిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ గరివిడి మండలాధ్యక్షుడు మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యుడు వాకాడ శ్రీనివాసరావు, మాజీ ఎంపీపీ కొణిశ కృష్ణంనాయుడు, వైస్ ఎంపీపీలు రామకృష్ణరాజు, శ్రీరాములనాయుడు, పార్టీ చీపురుపల్లి మండలాధ్యక్షుడు ఇప్పిలి అనంతం, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసులనాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు మీసాల వరహాలనాయుడు, యువజన విభాగం అధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ, ఏఎమ్‌సీ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, మెరకముడిదాం మండల నాయకుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఎస్.వి.రమణరాజు, పార్టీ మండలాధ్యక్షుడు తాడ్డి వేణు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు కోట్ల విశ్వేశ్వరరావు, బూర్లె నరేష్‌కుమార్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, పార్టీ గుర్ల మండలాధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు సీర అప్పలనాయుడు, నాలుగు మండలాల పీఏసీఎస్ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.