
విద్యార్థుల జీవితాలతో చెలగాటమా...?
–10లో
లోకేష్ నోరు మూగబోయిందా?
ఆంధ్రా ప్రజలను విద్యుత్ చార్జీలు, అదానీ స్మార్ట్ మీటర్లతో నిలువు దోపిడీ చేస్తున్న కూటమి ప్రభుత్వ తీరును సీపీఐ, సీపీఎం, ప్రజా సంఘాల నాయకులు దుయ్యబట్టారు.
విజయనగరం: విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఉన్నత చదువులు చదువుకుని కుటుంబానికి అండగా నిలవాలన్న ఆకాంక్షతో ఉన్న ఊరిని, కన్న తల్లిదండ్రులను వదిలివచ్చి హాస్టళ్లలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోందని వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, గురుకుల విద్యాలయాలు, కేజీబీవీల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలపై వారంరోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను గుర్తించారు. వాటిని పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, విద్యార్థులకు కనీస సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. అనంతరం వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్ధి విభాగం అధ్యక్షుడు కరుమజ్జి సాయికుమార్, యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, యువజన విభాగం నాయకులు జి.ఈశ్వర్‌కౌశిక్, చీపరుపల్లి నియోజకవర్గం విద్యార్థి విభాగం అధ్యక్షుడు బమ్మిడి కార్తీక్ మీడియాతో మాట్లాడుతూ హాస్టళ్లలో పారిశుద్ధ్యం నిర్వహణ సరిగాలేదని, మెనూ అమలుకావడం లేదని, కాస్మోటిక్ చార్జీలు అందడం లేదని, ఇన్వెర్టర్లు లేకపోవడంతో విద్యుత్ సరఫరా అంతరాయం సమయంలో అంధకారం అలముకుంటోందని, ప్రహరీలు లేక విషసర్పాల భయం వెంటాడుతోందని తెలిపారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, స్నానపు గదులు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో జిల్లా విద్యాశాఖ అధికారులు వారంలో ఒక రోజు బసచేసే కార్యక్రమాన్ని రూపొందించాలని, క్షీణించిన పారిశుధ్యం మెరుగు పరచాలని ప్రభు త్వాన్ని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాజాం నియోజకవర్గం అధ్యక్షుడు భీమేశ్వరరావు, విద్యార్థి విభాగం నాయకులు దీరుయాదవ్, మణికంఠ, భగవాన్, ప్రవీణ్, నవీన్, యువజన విభాగం నాయకులు భార్గవ్, సురేష్, గౌతం, పవన్, తదితరులు పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థుల సమస్యలు
పరిష్కరించాలని డిమాండ్
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన
విభాగాల నాయకులు