
గుర్తింపులేని స్కూల్ సీజ్
విజయనగరం అర్బన్: పట్టణంలోని బొడ్డు వారి జంక్షన్‌లో ప్రభుత్వ గుర్తింపులేకుండా నిర్వహిస్తున్న చైతన్య భారతి ప్రైవేటు స్కూల్‌ను విద్యాశాఖ అధికారులు మంగళవారం సీజ్‌చేశారు. ఇటీవల అందిన ఫిర్యాదు మేరకు తనిఖీ చేయాలని విద్యాశాఖ అధికా రులను కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ మేరకు డిప్యూటీ ఈఓ కె.వి.రమణ, ఎంఈఓ సత్యవతి పర్యవేక్షణలో ప్రత్యేక బృందం మంగళవారం స్కూల్‌ను తనిఖీ చేసింది. గుర్తింపు లేకపోవడంతో సీజ్‌చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు తెలిపారు.
మడ్డువలసకు 1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టుకు 1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు వద్ద మంగళవారం 64.35 మీటర్ల మేర నీటిమట్టం నమోదు కాగా, ఎగువ ప్రాంతాల్లో వర్షపు జల్లులు కురుస్తుండడంతో వేగావతి, సువర్ణముఖి నదుల నుంచి ప్రాజెక్టులోకి 1500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. వస్తున్న నీటిని ఒక గేటు ఎత్తి కిందకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ తెలిపారు. కుడి ప్రధాన కాలువ ద్వారా పంట పొలాలకు 700 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నామన్నారు.