
పేదల గొంతుక వైఎస్సార్‌సీపీ
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
మంత్రి ప్రకటించుకున్నారని ఏడాదిలోనే ఎలా ధనికులయ్యారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెబితే వారు కూడా బాగుపడతారని ఎద్దేవా చేశారు. వైస్సార్‌సీపీలో రానున్న రోజుల్లో కార్యకర్తలే రథసారథులవుతారని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హైమావతి, జీసీసీ మాజీ చైర్మన్ స్వాతిరాణి, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఐదు మండలాల పార్టీ అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
నోరు విప్పలేని దుస్థితి
కూటమి ఏడాది పాలనలో అన్యాయంపై ప్రజలు నోరు విప్పలేని పరిస్థితి ఉందని ఎస్.కోట నియోజకవర్గ పార్టీ కన్వీనర్ కడుబండి శ్రీనివాసరావు అన్నారు. సూపర్ సిక్స్, ష్యూరిటీ బాండ్లు అన్ని మోసం అని పేర్కొన్నారు. జూన్ 4న నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల్లో వచ్చిన స్పందనే కూటమిపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. క్యాలెండర్ ప్రకారం పథకాలు అమలు చేసిన ఘనత ఒక్క జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. కూటమి మోసాలను ప్రజలకు వివరించేందుకు మనమంతా ఐదు వారాలు పాటు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాల్సి ఉందన్నారు.
శృంగవరపుకోట: పేదవాడి గొంతుక, శ్వాసే వైఎస్సార్‌సీపీ అని, అధికారంలో ఉంటే ప్రజల కోసం... ప్రతిపక్షంలో ఉంటే ప్రజల తరఫున పని చేస్తుందని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులొచ్చినా జిల్లా నాయకత్వం వెన్నంటి ఉంటుందని, కూటమి చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎస్.కోటలోని ఎరుకమ్మ పేరంటాలు కల్యాణ మండపంలో మండల పార్టీ అధ్యక్షుడు మోపాడ కుమార్ అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన ముందుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు పంచిపెట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి సర్కారు ప్రజలను ఎలా మోసం చేస్తోందో తెలియజేసేందుకు బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని ఐదు వారాల్లో క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించామన్నారు. సూపర్ సిక్స్ ఉత్తిదేనని తేలిపోయిందని ప్రజలు గుర్తించారన్నారు. కూటమి నేతల మోసపూరిత హామీలు నమ్మి మోసపోయామని ప్రజలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. అందరికీ తల్లికి వందనం, 50 ఏళ్లకే పింఛన్, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి అన్ని ఉత్తివేనని తేలిపోయిందని ధ్వజమెత్తారు. పచ్చ మీడియా ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతున్నారని కానీ వాస్తవాలు ప్రజలు గుర్తించారని అన్నారు. మన చేతుల్లో ఉన్న ఫోనే మనకు ఆధారం, సోషల్ మీడియానే మనకు అండ అని చెప్పారు. జిల్లా మంత్రి మాటలు నీటి మూటలని ప్రజలు గుర్తించారన్నారు. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గత మూడు ప్రభుత్వాల్లో మంత్రిగా పని చేశారని, ఆయన హయాంలోనే జిల్లాలో గ్రామీణ రోడ్లు, రక్షిత మంచినీటి పథకాలు, శారడా, మహామయ వంటి కంపెనీలు, భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చాయని జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న ఎంఎస్‌ఎంఈ మంత్రి జిందాల్ భూముల్లో ఎంఎస్‌ఎంఈ పార్కు ప్రతిపాదనే లేదని, తాటిపూడి నీటి ప్రస్తావన ఎందుకంటున్నారని మోసపూరితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తన శాఖలో ఎం జరుగుతుందో మంత్రికే తెలియని పరిస్థితి నెలకొందన్నారు. తాను ధనికుడని ఇటీవల

పేదల గొంతుక వైఎస్సార్‌సీపీ