ఈ–బీట్స్‌తో పటిష్ట గస్తీ
విజయనగరం క్రైమ్: జిల్లాలో నేరాలు తగ్గించేందుకు ‘ఈ–బీట్స్’ విధానంలో గస్తీని పటిష్టం చేస్తున్నట్టు ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ–బీట్స్ విధానంపై పోలీసు అధికారులు, సిబ్బందికి జూమ్ మీటింగ్ ద్వారా గురువారం అవగాహన కల్పించారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పోలీస్ గస్తీని ట్రాక్ చేయడం, పహారా విధులను విశ్లేషించడం, పర్యవేక్షణ వంటివి లైవ్‌లోనే జరుగుతాయన్నారు. దీనికోసం పోలీస్ అధికారులు, సిబ్బందికి ముందుగా యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్స్ క్రియేట్ చేస్తామని తెలిపారు. పోలీస్ బీట్‌లను నిర్ధారించి సిబ్బందికి విధులు కేటాయిస్తామన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందని, బీట్‌వారీగా సమయానుగుణంగా విధులు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పారు. పోలీస్ స్టేషన్ అవసరాలు, ప్రాధాన్యతలను అనుసరించి బీట్‌లను మార్చుకోవచ్చని తెలిపారు. ఈ–బీట్ అలర్ట్స్ అనే ఆప్షన్‌తో సంబంధిత అధికారులు ఎక్కడ నుంచైనా పరిశీలించవచ్చన్నారు. ఈ–బీట్స్ యాప్ పనితీరును టెక్నీషియన్ బి.హర్ష వివరించారు. జూమ్ మీటింగ్‌లో అదనపు ఎస్పీ (అడ్మిన్) పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఎ.వి.లీలారావు, ఆర్వీఆర్‌కే చౌదరి, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ వకుల్ జిందల్


