ఖబడ్దార్‌..! | - | Sakshi
Sakshi News home page

ఖబడ్దార్‌..!

May 20 2024 2:25 AM | Updated on May 20 2024 2:25 AM

ఖబడ్ద

ఖబడ్దార్‌..!

ప్రైవేట్‌ ఆస్పత్రులపై వస్తున్న

ఫిర్యాదులివే

● నోటిఫైడ్‌ డిసీజ్‌ (డెంగీ మొదలుకుని టీబీ వరకు)బాధితుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయకపోవడం

● ఇష్టారాజ్యం లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండడం

● జనన ధ్రువీకరణ వివరాలు పోర్టల్‌లో నమోదు చేయకపోవడం

● సరైన కారణాలు లేకుండానే అబార్షన్లు నిర్వహించడం

● డెంగీ చికిత్సకు భారీగా డబ్బులు వసూలు చేయడం

● ఆరోగ్యశ్రీ సేవలకు రోగుల నుంచి డబ్బు వసూలు చేయడం

● కాన్పు సమయంలో తల్లుల మృతి పట్ల సరైన కారణాలు చూపకపోవడం

పార్వతీపురంటౌన్‌: ప్రజారోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. వైద్యసేవలు పారదర్శకంగా అందజేయాలని, ప్రతి సేవకు జవాబుదారీగా ఉండాలని వైద్యారోగ్యశాఖ అధికారులకు సూచిస్తోంది. ఇందులో భాగంగా ఆస్పత్రుల తనిఖీలను తప్పనిసరి చేసింది. ప్రతినెలా ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల తనిఖీకి ప్రత్యేక బృందాలను నియమించింది. నోటిఫైడ్‌ వ్యాధుల వివరాలు, సేవల తీరును విధిగా నమోదు చేయాలని ఆదేశాలు జారీచేసింది. వైద్యసేవలు అందజేయడంలో నిర్లక్ష్యం వహించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా, ఆస్పత్రి సేవల వివరాలు సరిగా నమోదు చేయకపోయినా ప్రైవేట్‌ ఆస్పత్రుల లైసెన్స్‌ రద్దు చేయాలని జిల్లా ఉన్నతాధికారులకు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ సూచించారు. దీంతో పార్వతీపురం మన్యం జిల్లాలో ఆస్పత్రుల తనిఖీలను వైద్యారోగ్యశాఖ అధికారులు ముమ్మరం చేశారు. ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్స్‌, ఆస్పత్రులు, క్లినిక్‌ల సేవలపై నిఘా పెంచారు.

ప్రతి నెలా ఆరు ప్రైవేట్‌ ఆస్పత్రుల తనిఖీ

డీఎంహెచ్‌ ప్రతి నెలా జిల్లాలో ఆరు ప్రైవేట్‌ ఆస్పత్రులను తనిఖీ చేయాలి. తనిఖీ చేసిన ఆస్పత్రుల నివేదికను కుటుంబ సంక్షేమశాఖ పోర్టల్‌కు అనుసంధానించాలి. డీఎంహెచ్‌ఓతో పాటు మరో తనిఖీ బృందం కూడా ఉంటుంది. ఈ బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించి ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలి. ప్రైవేట్‌ వ్యక్తుల నుంచి నర్సింగ్‌ హోమ్‌ మీద వచ్చిన ఫిర్యాదులకు తక్షణమే స్పందించి పరిష్కరించాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించుకోని ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోనున్నారు.

డెంగీగా నిర్ధారణ అయితేనే..

డెంగీ వ్యాధి నోటిఫైడ్‌ డిసీజ్‌. ఈ వ్యాధి సోకినప్పుడు ప్రైవేట్‌ ఆస్పత్రులు తప్పకుండా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. అలా చేయకుండా ఏ జ్వరమైనా డెంగీగా చిత్రీకరించి, ప్లేట్‌లెట్లు తగ్గాయని వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి వైరల్‌ ఫీవర్‌కు కూడా ప్లేట్‌లెట్లు తగ్గడం సహజం. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో దీనిపై దోపిడీ జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇకపై ఇలా చేసిన ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. డెంగీ నిర్ధారణ రక్తపరీక్షల ద్వారానే కాదు, ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలీసా టెస్టులో నిర్ధారణ అయితేనే డెంగీగా పరిగణించాలి. ప్లేట్‌లెట్లు తగ్గగానే డెంగీగా చిత్రీకరిస్తున్నారు. దీనిపై తనిఖీ బృందం ప్రత్యేక దర్యాప్తు నిర్వహిస్తుంది.

సేవల్లో తేడా వస్తే ప్రైవేట్‌ ఆస్పత్రుల

రిజిస్ట్రేషన్‌ రద్దు

ప్రతినెలా తనిఖీ చేయనున్న వైద్యారోగ్య శాఖ అధికారులు

నోటిఫైడ్‌ వ్యాధుల వివరాలు పోర్టల్‌లో నమోదు చేయాలి

డేటా ఎంట్రీ ఆపరేటర్లను

నియమించకపోతే చర్యలు

ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ తప్పనిసరి

నోటిఫైడ్‌ వ్యాధులైన మలేరియా, డెంగీ, ఏఎఫ్‌పి, మీజిల్స్‌ (రాష్‌ తో కూడిన జ్వరం), పాము కాటు, కుక్క కాటు మొదలైనవి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో గుర్తిస్తే వెంటనే సమాచారం అందజేసి ఐహెచ్‌ఐపీ పోర్టల్‌లో తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోతే ఆ యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు తప్పవు. డెంగీ చికిత్సకు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం ఉంది. దానిపై నిఘా పెట్టాం.

– డాక్టర్‌ టి.జగన్‌మోహన్‌రావు,

డీఎంఓ, పార్వతీపురం మన్యం

రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తాం

ప్రాణాంతక మలేరియా, డెంగీ, టీబీ, మ్యూకోమైకోసిస్‌, హ్యూమన్‌ రేబిస్‌, టైఫాయిడ్‌ వివరాలు ఇంటిగ్రేటెడ్‌ హెల్త్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌, అబార్షన్‌, డెలివరీలు, ఆపరేషన్‌ వివరాలను హెల్త్‌ మెడికల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌లో నమోదు విషయమై ప్రైవేట్‌ నర్సింగ్‌ హోమ్స్‌ను తనిఖీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. వివరాల నమోదులో నిర్లక్ష్యం చేస్తే షోకాజ్‌ నోటీసులు జారీ చేసి క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ చట్టం ప్రకారం ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తాం. డా.కె.విజయ పార్వతి,

డీఎంహెచ్‌ఓ, పార్వతీపురం మన్యం

ఖబడ్దార్‌..!1
1/4

ఖబడ్దార్‌..!

ఖబడ్దార్‌..!2
2/4

ఖబడ్దార్‌..!

ఖబడ్దార్‌..!3
3/4

ఖబడ్దార్‌..!

ఖబడ్దార్‌..!4
4/4

ఖబడ్దార్‌..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement