
● బొబ్బిలిలో 23న జరిగే బస్సు యాత్రకు తరలి రావాలి ● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే శంబంగి ● సన్నాహాక సమావేశాల్లో నేతలకు పిలుపు
బొబ్బిలి: బొబ్బిలిలోని శ్రీ కళాభారతి వద్ద ఈ నెల 23న నిర్వహించనున్న వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయం చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సామాజిక సాధికార బస్సు యాత్ర జయప్రదం చేసేందుకు ఆదివారం నియోజకవర్గ వ్యా ప్తంగా సుడిగాలి పర్యటన చేసారు. ఆయా మండలాల్లో నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. బొబ్బిలి వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మున్సిపల్ నాయకులతో పాటు, బొబ్బిలి, తెర్లాం మండలాల పార్టీ ముఖ్య నాయకులతో ముందస్తు సమావేశాలు నిర్వహించారు. బాడంగి, రామభద్రపురం మండల కేంద్రాల్లోనూ నిర్వహించి న ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా మజ్జి శ్రీని వాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సామాజిక వర్గాలకు పెద్ద పీట వేసి వారి మనుగడను ముందుకు తీసుకువచ్చి పెద్ద ఎత్తున పదవులు కల్పించి వారిని గౌరవ ప్రదంగా నిలబెట్టిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సామాజిక న్యాయం, గ్రామ స్వరాజ్యం సిద్ధించిన విషయం అందరికీ తెల్సిందేన ని, ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలన్నా రు. బస్సు యాత్ర రోజున రామభద్రపురంలో విలేకరుల సమావేశం నిర్వహించి బైక్ ర్యాలీతో బొబ్బి లి గ్రోత్ సెంటర్‌కు వెళతామన్నారు. సామాజిక సాధికారత ఎలా సంక్రమించింది, ఎవరెవరరికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందన్న విషయాన్ని ప్రజాప్రతినిధులు వివరిస్తారన్నారు. అక్కడి నుంచి పట్టణంలోకి ర్యాలీగా వెళ్లి సాయంత్రం నిర్వహించే బహిరంగ సభకు జనం తరలి రావాలన్నారు. ఈ బహిరంగ సభకు నియోజకవర్గంలోని మారుమూ ల పల్లెల నుంచి కూడా భారీ ఎత్తున ప్రజలు తరలి వచ్చేలా చేయాల్సిన బాధ్యత నాయకులదేనన్నారు. ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు మాట్లాడుతూ పట్టణంలోని ప్రతీ వార్డు నుంచి లబ్ధిదారులు తరలి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మండలంలోని ప్రతి గ్రామంలోనూ ఉన్న ఆయా వర్గాలను తరలించాలన్నారు. పట్టణ, మండల అధ్యక్షులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు చోడిగంజి రమేష్ నాయుడు, ఉత్తరావిల్లి అప్పలనాయుడు, ఎంపీపీ చొక్కాపు లక్ష్మణరావు, అప్పికొండ లక్ష్మునాయుడు, అప్పికొండ సరస్వతి, శంబంగి వేణుగో పాలనాయుడు, బొమ్మినాయుని వెంకటనాయుడు, తెంటు సత్యంనాయుడు, నర్సుపల్లి బాబ్జీరావు, పెద్దింటి రామారావు, తెంటు మధు, యువ నాయకులు శంబంగి శ్రీకాంత్, జడ్పీటీసీ సంకిలి శాంతకు మారి, మున్సిపల్, ఏఎంసీ వైస్ చైర్మన్లు చెలికాని మురళి, తెంటు పార్వతి, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, వైఎస్సార్ సీపీ నాయకులు పాల్గొన్నారు.