
సొంతింటి కల సాకారం
మాకు ఇంతవరకు సొంతిల్లు లేదు. స్థలం కొనుగోలుచేసి కట్టుకునే ఆర్థికస్థోమత లేదు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏర్పాటుచేసిన వైఎస్సార్‌జగనన్న కాలనీలో స్థలం, ఇల్లు మంజూరు చేశారు. పునాదులు తవ్వుకున్నాం. ఇప్పటికే మాకు 40 బస్తాల సిమ్మెంట్‌ను ప్రభుత్వం హౌసింగ్ శాఖ నుంచి అందజేసింది. కొద్దినెలల్లో సొంతింటి కల సాకారం కానుంది. ఎవరి కాళ్లు పట్టుకోకుండానే మాకు సొంతింటి భాగ్యం కల్పించిన జగన్‌మోహన్‌రెడ్డి రుణపడి ఉంటాం.
– డబ్బాడ జయలక్ష్మి, జి.అగ్రహారం, చీపురుపల్లి
బడి బాగుంది..
నాడు–నేడు కింద మా ఊరి బడిని అందంగా ముస్తాబుచేశారు. గతంలో కనీసం మరుగుదొడ్డి ఉండేది కాదు. ఇప్పుడు టైల్స్‌తో కూడిన గచ్చులు.. తాగునీటి వసతి, మరుగుదొడ్ల సదుపాయాలు.. పిల్లలను ఆకర్షించేలా తరగతి గదులు, గోడలపై విజ్ఞానం పంచే చిత్రాలు.. ఇలా మా ఊరిబడి పూర్తిగా మారిపోయింది. పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఉపాధ్యాయులు కూడా మంచిగా చదువు చెబుతున్నారు. గతంలో మా పిల్లలు బడికి వెళ్లి వచ్చే సరికి దుస్తులు మొత్తం పాడయ్యేవి. ఇప్పుడు.. శుభ్రంగా ఉంటున్నాయి. పేదపిల్లల విద్యకోసం ఇన్ని సదుపాయాలు కల్పించిన జగనన్నకు కృతజ్ఞతలు. ఇంతకంటే మాకు ఇంకేం కావాలి.
– మీసాల భూలక్ష్మి, వంగపల్లిపేట
నిరీక్షణకు తెర
నేను గృహిణిని. ఉద్యోగం ఉన్నట్టు సోషల్ ఆడిట్‌లో చూపించడంతో రైస్ కార్డు మంజూరు చేయలేదు. ఫలితంగా వృద్ధాప్య పింఛన్, రేషన్ సరుకులు, ఇతర ప్రభుత్వ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడ్డాను. జగనన్న సురక్ష కార్యక్రమం కింద వలంటీర్ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకొని వార్డులో నిర్వహించిన సురక్ష కార్యక్రమంలో నాకు రైస్‌కార్డు అందజేశారు. ఇప్పుడు నేను పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాను. జనవరిలో పింఛన్ వస్తుందని వలంటీర్ బాబు తెలిపారు. చాలా ఆనందంగా ఉంది.
– గొడబ సుజాత దేవి, పార్వతీపురం పట్టణం
రాష్ట్రంలో ప్రజాసంక్షేమ, అభివృద్ధి పాలన నిర్విఘ్నంగా సాగుతోంది. ఇంటింటా ‘నవరత్న’ వికాసం స్పష్టంగా కనిపిస్తోంది. పేదవర్గాలు ఆర్థి కోన్నతి చెందుతున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన సచివాల య వ్యవస్థతో గ్రామస్వరాజ్యం సిద్ధించింది. అర్హతే కొలమానంగా సంక్షేమ పథకాలు చేరువవుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా సాగుతున్న సంక్షేమ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ జీవితాలు బాగుపడ్డాయని చెబుతున్నారు.




