మారింది | - | Sakshi
Sakshi News home page

మారింది

May 31 2026 1:00 AM | Updated on May 31 2026 1:00 AM

రూట్‌

ప్లేట్‌

సాక్షి, విశాఖపట్నం: సాగరతీరం ఇప్పుడు సరికొత్త ఆరోగ్య సూత్రాలను పాటిస్తోంది. నిన్నటివరకు రుచుల వేటలో మునిగితేలిన వైజాగ్‌వాసులు.. ఇప్పుడు ‘పోష కాల’ బాట పడుతున్నారు. తమ రోజువారీ ఆహారంలో ప్రోటీన్‌ (మాంసకృతులు) శాతాన్ని పెంచుకుంటూ సరికొత్త జీవనశైలికి తెరతీస్తున్నారు. మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్‌ ఫుడ్‌ మాత్రమే ఉండేలా ఆర్డర్లు చేసేసుకుంటున్నారు. ప్రముఖ క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ ‘ఇన్‌స్టామార్ట్‌’ తాజాగా విడుదల చేసిన ప్రోటీన్‌ ట్రెండ్స్‌ నివేదిక ప్రకారం.. దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్‌ వినియోగ కేంద్రాల్లో వైజాగ్‌ ఒకటిగా నిలిచింది.

ఫుడ్‌ బాస్కెట్‌లో బ్యాలెన్స్‌ : వైజాగ్‌ వాసులు తమ ఆహార ఎంపికల్లో అటు సంప్రదాయాన్ని.. ఇటు ఆధునిక అవసరాలను అద్భుతంగా మేళవిస్తున్నారు. నగరంలో ప్రోటీన్‌ కొనుగోళ్లలో శాకాహార, మాంసాహార ఎంపికల మధ్య చక్కని సమతుల్యత పాటిస్తున్నారు. నగరవాసుల ప్రోటీన్‌ ఫుడ్‌ బాస్కెట్‌లో ‘గుడ్లు, పనీర్‌’ మొదటి స్థానంలో ఉంటూ రాజ్యమేలుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో చికెన్‌, శనగలు నిలిచాయి. పూర్వీకుల ఆహారమైన ‘వేయించిన శనగలు’ వంటి సంప్రదాయ ప్లాంట్‌ బేస్డ్‌ ప్రోటీన్‌ వనరులపై వైజాగ్‌లో మళ్లీ ఆసక్తి విపరీతంగా పెరుగుతోందని సర్వేలో తేలింది.

హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌లో.. యోగర్ట్‌కు జై : ఉరుకుల పరుగుల జీవితంలోనూ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైజాగ్‌ వాసులు నిర్ణయించుకున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది. ఉదయాన్నే సులభంగా తయారయ్యేలా.. ప్రోటీన్‌ అధికంగా ఉండే ఓట్స్‌.. పోహా (అటుకులు) వంటి అల్పాహార ఎంపికలు నగరంలో ప్రతి ఇంటా రోజువారీ అలవాటుగా మారిపోతున్నాయి. ఫిట్‌నెస్‌, డైట్‌ మీద శ్రద్ధ చూపేవారు సాధారణ పెరుగు కంటే ‘గ్రీక్‌ యోగార్ట్‌’ వైపు మొగ్గు చూపుతున్నారు.

ఉదయం 7 నుంచి 11 వరకు : ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రారంభించడానికి ఉద యం వేళను మించిన సమయం లేదంటున్నారు వైజాగ్‌వాసులు. ఇన్‌స్టామార్ట్‌ విశ్లేషణ ప్రకారం.. నగరంలో ప్రోటీన్‌ ఉత్పత్తుల ఆర్డర్లు ఎక్కువగా ఉదయం 7 గంట ల నుంచి 11 మధ్యే నమోదవుతున్నాయి. రోజు ప్రారంభంలోనే పోషకాలను నింపుకోవడానికి వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారని ఇది స్పష్టం చేస్తోంది. ఒకప్పుడు ప్రోటీన్‌ అంటే కేవలం జిమ్‌కు వెళ్లే బాడీ బిల్డర్లకు మాత్రమే అవసరమన్న భావన నుంచి.. ప్రతి రోజూ తినే ఆహారంలో ప్రోటీన్‌ ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయిందని విశాఖ ప్రజలు స్పష్టం చేస్తున్నారు.

విశాఖ వాసుల ‘ఉదయ’ రాగం

ఉదయాన్నే మారిన ఆహారపు అలవాట్లు

ప్రోటీన్‌ ఫుడ్‌పైనే నగరవాసుల మోజు

గుడ్లు, పన్నీర్‌, యోగర్ట్‌, ఓట్స్‌, పోహా, శనగలు, చికెన్‌..

మార్నింగ్‌ బ్రేక్‌ఫాస్ట్‌ ప్లేట్‌లో ప్రోటీన్‌కే జై కొడుతున్న ప్రజలు

రెండేళ్ల కాలంలో ప్రోటీన్‌ వినియోగం 200 శాతం వృద్ధి

ఇన్‌స్టామార్ట్‌ సర్వేలో ఆసక్తికరమైన విశేషాలు

Advertisement
 
Advertisement
Advertisement