● అందులోకి ఎలా బ్రో! | - | Sakshi
Sakshi News home page

● అందులోకి ఎలా బ్రో!

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

నోళ్ల ఐడియాలకు హద్దులు ఉండవు అనడానికి ఈ ఫొటోనే నిదర్శనం. ఆటో లేదా గూడ్స్‌ వాహనం మాట్లాడితే వందల్లో ఖర్చవుతుందని భావించారో ఏమో కానీ... ఏకంగా స్కూటర్‌ పైనే భారీ వాషింగ్‌ మెషీన్‌ను తరలించే సాహసానికి పూనుకున్నారు. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే.. ఆ భారీ డబ్బా కింద ఒక మనిషి ఉన్నాడు. వెనుక కూర్చున్న వ్యక్తి ఆ మెషీన్‌ బాక్స్‌ లోపల దూరిపోయి దాన్ని బ్యాలెన్స్‌ చేస్తూ కూర్చున్నాడు. చూడ్డానికి మనోళ్ల ఐడియా నవ్వు తెప్పిస్తున్నా.. రోడ్డు భద్రత దృష్ట్యా ఇది చాలా ప్రమాదకరం. వెనుక ఉన్న వ్యక్తికి చుట్టుపక్కల ఏం జరుగుతుందో కనిపించదు, డ్రైవర్‌కు బ్యాలెన్స్‌ తప్పే ప్రమాదం ఉంటుంది. కాస్త రవాణా ఖర్చులు ఆదా చేయడం కోసం, ఇలా రోడ్డు భద్రతా నియమాలను గాలికి వదిలేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. డబ్బు కంటే ప్రాణం ఎంతో విలువైనది బ్రదర్‌!

Advertisement
 
Advertisement
Advertisement