ఐడీఏ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఐడీఏ ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలి

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

డాబాగార్డెన్స్‌: పారిశ్రామిక కరువు భత్యం (ఐడీఏ) ఉత్తర్వుల విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్లు బుధవారం డాబాగార్డెన్స్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. కమిటీ ఆఫ్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ పెన్షనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జాతీయ సంఘం పిలుపు మేరకు చేపట్టిన ధర్నాలో ఏఐబీఎస్‌ఎన్‌ఎల్‌పీడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి కె.సోమసుందరరావు పాల్గొని మాట్లాడారు. పెన్షనర్లు ఐక్యంగా ఉంటూ ప్రభుత్వ కుట్రలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఏయూఏబీ కన్వీనర్‌ పీసీసీహెచ్‌ విద్యాసాగర్‌ మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షనర్లు చేపట్టే భవిష్యత్‌ ఆందోళన కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఎస్‌ఎన్‌పీడబ్ల్యూఏ జిల్లా కార్యదర్శి ఎస్‌ఎస్‌ వరప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నేరుగా చెల్లించే బీఎస్‌ఎన్‌ఎల్‌ పెన్షన్ల విషయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆర్థిక పరిస్థితితో ముడి పెట్టడం సరి కాదన్నారు. ఏఐబీఎస్‌ఎన్‌ఎలపీడబ్ల్యూఏ జాతీయ ఉపా ధ్యక్షుడు ఎం.ఆర్‌.పట్నాయక్‌ మాట్లాడుతూ పెన్షనర్లు సంఘటితంగా భవిష్యత్‌ పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐబీడీఏ సహాయ కార్యదర్శి ఉమారెడ్డి, పెన్షనర్ల సంఘం నేతలు శ్రీమన్నారాయణ, వీఆర్‌కే శర్మ, కేవీడీ స్వామి, పి.బాబూరావు, చిట్టిబాబు, పి.లచ్చిరాజు, అష్రఫ్‌, ఏయూఏబీ నాయకులు రాజ్‌కుమార్‌, నాగరాజు, సుబ్రహ్మణ్యం, బీఎస్‌ చక్రవర్తి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement