రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి

May 21 2026 10:25 AM | Updated on May 21 2026 10:25 AM

పెందుర్తి : బతుకు తెరువుకోసం విశాఖ వచ్చి చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అతన్ని విధి చిన్నచూపు చూసింది. రోడ్డుప్రమాదం రూపంలో అతన్ని బలితీసుకుంది. కుటుబంలో తీరని విషాదం నింపింది. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం జిల్లా కల్లెంపూడికి చెందిన బొమ్మిడి మురళి (27) భార్య వెంకటలక్ష్మి, కొడుకు హిమాంత్‌(3)తో కలిసి విశాఖలోని చినముషిడివాడ పాత ఊరులో నివాసం ఉంటున్నాడు. బిగ్‌బాస్కెట్‌లో డెలివరీబాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం డెలివరీ తీసుకొని చినముషిడివాడ నుంచి పెందుర్తివైపు బీఆర్‌టీఎస్‌ మధ్యరోడ్డులో బైకుపై వెళ్తున్నాడు. ముందు ఉన్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టాక్‌ చేయబోతుండగా ఎదురుగా కారు రావడంతో గందరగోళానికి గురై అదుపుతప్పి కిందపడిపోయాడు. ఆర్టీసీ బస్సు వెనుకచక్రాలు మురళి తలపై నుంచి వెళ్లిపోవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement