మహారాణిపేట: జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎం.అభిషిక్త్ కిశోర్ గురువారం కలెక్టరేట్‌లోని పలు విభాగాలను సందర్శించారు. ప్రతి సెక్షన్‌కు వెళ్లి రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. 24/7 కంట్రోల్ రూమ్‌ను సందర్శించి, ప్రజల నుంచి వచ్చే ఫోన్ల వివరాలు, ఫిర్యాదుల నమోదు ప్రక్రియపై ఆరా తీశారు. ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, ప్రజలకు సులభంగా కనిపించేలా బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. అనంతరం డీఎస్‌వో కార్యాలయం, కొత్తగా నిర్మిస్తున్న హడ్కో భవనాన్ని, స్ట్రాంగ్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌కు వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీదారులను ఎక్కువ సేపు నిరీక్షించకుండా, త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందరూ బాధ్యతగా వ్యవహరించి, ఉత్తమ పనితీరు కనబరచాలని సూచించారు. ఆయన వెంట జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇన్‌చార్జి ఆర్డీవో శేషశైలజ, కలెక్టరేట్ ఏవో బీవీ రాణి తదితరులు ఉన్నారు.
కలెక్టర్ అభిషిక్త్ కిషోర్


