టాప్‌గేర్‌లో విశాఖ ఉక్కు | - | Sakshi
Sakshi News home page

టాప్‌గేర్‌లో విశాఖ ఉక్కు

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

● ఉత్పత్తి, అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి ● ఉత్పత్తిలో 52 శాతం పెరుగుదల ● 2025–26లో రూ.22,311 కోట్లకు చేరిన విక్రయాలు

ఉక్కునగరం: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి, అమ్మకాల్లో గణనీయమైన వృద్ధిని సాధించింది. 2024–25లో హాట్‌ మెటల్‌ 3.91 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేయగా.. 2025–26లో 52 శాతం వృద్ధితో 5.95 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి సాధించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 3.75 మి.ట ద్రవపు ఉక్కు ఉత్పత్తి చేయగా గత ఆర్థిక సంవత్సరంలో 5.69 మిలియన్‌ టన్నులు ఉత్పత్తి చేసి 52 శాతం వృద్ధి నమోదు చేసింది. క్రూడ్‌ స్టీల్‌ కూడా 51 శాతం వృద్ధితో 5.43 మిలియన్‌టన్నులకు చేరింది. అమ్మకాలు విషయానికి వస్తే 2024–25లో 3.49 మిలియన్‌ టన్నులతో రూ.18,288 కోట్లు చేయగా 2025–26లో 4.42 మి.టన్నులతో రూ. 22,311 కోట్లు అమ్మకాలు చేసి పరిణామంలో 27 శాతం, అమ్మకాల్లో 22 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఉత్పత్తి, అమ్మకాల వృద్ధిలో ఉద్యోగుల నిరంతర కృషి ప్రతిబింబింస్తుందని యాజమాన్యం తెలిపింది. ఉత్పాదకత, వ్యయ నియంత్రణ, వినియోగదారుల సంతృప్తిపై సంస్థ దృష్టి పెట్టిందని పేర్కొంది.

హాట్‌మెటల్‌ ఉత్పత్తిలో రికార్డు

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ 2025–26 ఆర్థిక సంవత్సరంలో హాట్‌ మెటల్‌ ఉత్పత్తిలో సరికొత్త రికార్డు నమోదు చేసింది. స్టీల్‌ప్లాంట్‌ ప్రారంభం నుంచి మూడు బ్లాస్ట్‌ఫర్నేస్‌లు కలిపి 2021–22లో ఉత్పత్తి చేసిన 57,73,6500 టన్నుల హాట్‌ మెటల్‌ ఇప్పటి వరకూ రికార్డుగా ఉంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి 59,55,156 టన్నులు ఉత్పత్తి చేసి సరి కొత్త రికార్డు సాధించింది.విభాగం ఉన్నతాధికారులు ఉద్యోగులను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement