మధ్యవర్తిత్వ పోటీల్లో ముంబై లా వర్సిటీ విజయం | - | Sakshi
Sakshi News home page

మధ్యవర్తిత్వ పోటీల్లో ముంబై లా వర్సిటీ విజయం

Mar 30 2026 7:20 AM | Updated on Mar 30 2026 7:20 AM

సబ్బవరం: దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో మూడు రోజుల పాటు జరిగిన డీవీ సుబ్బారావు రెండో జాతీయ మధ్యవర్తిత్వ పోటీలు శనివారం ఘనంగా ముగిశాయి. దేశవ్యాప్తంగా వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి 23 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్స్‌లో ముంబైకి చెందిన మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ జట్టు ప్రథమ స్థానంలో నిలిచి విజేతగా ఆవిర్భవించగా, ఒడిశా నేషనల్‌ లా యూనివర్సిటీ జట్టు ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ ముగింపు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ న్యాయపతి విజయ్‌, జస్టిస్‌ చల్లా గుణరంజన్‌, ప్రొఫెసర్‌ ఆర్‌. వెంకటరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ మాట్లాడుతూ తమ విద్యార్థి దశలో ఇలాంటి ప్రాక్టికల్‌ పోటీలు లేవని, ప్రస్తుతం లభిస్తున్న ఇటువంటి అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. జస్టిస్‌ న్యాయపతి విజయ్‌ మాట్లాడుతూ ఈ తరహా పోటీలు న్యాయ విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు. ప్రొఫెసర్‌ ఆర్‌. వెంకటరావు మాట్లాడు తూ, ప్రముఖ న్యాయవాది, మాజీ బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ డీవీ సుబ్బారావు పేరుతో ఈ పోటీలు నిర్వహించడం గర్వకారణమన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ విశ్వచంద్రనాథ్‌ మదాసు, ఫ్యాకల్టీ కన్వీనర్‌ డాక్టర్‌ సుధా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement