సీతంపేట:సీతంపేటలో రాధాకృష్ణ ఆలయం వద్ద సీతారాముల కల్యాణ మహోత్సవ కమిటీ ప్రతినిధులు సంపంగి శ్రీనివాసరావు, భీమవరపు శ్రీనివాసరావు, ఇప్పిలి అప్పలనాయుడు ఆధ్వర్యంలో రాములోరి కల్యాణం వైభవంగా జరిగింది. సీతారాముల పంచలోహ ఉత్సవమూర్తులకు అర్చకుడు గంగవరపు భాస్కరశర్మ కల్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. సాయంత్రం సీతారాముల ఉత్సవ మూర్తులను మేళతాళాలతో పురవీధుల్లో ఊరేగించారు. మహిళలు సారె సమర్పించారు. కమిటీ సభ్యులు నమ్మి వెంకట్, గుదే వేణు, వంగలపూడి శ్రీనివాసరావు, సారిపిల్లి సంతోష్, పెద్దాడ హేమంత్, మొండి శ్రీధర్, ఇసరపు రామ్‌కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.


