ఎంవీపీకాలనీ: పారిశ్రామిక, ఇంజినీరింగ్ ఉత్పత్తుల అవగాహన వేదికగా గాదిరాజు ప్యాలెస్‌లో ‘ఇంటర్నేషనల్ ఎస్‌ఎంఈ బిజినెస్ ఎక్స్‌పో’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇండోర్ ఇన్ఫోలైన్ ప్రైవేట్ లిమిటెడ్, పీహెచ్‌డీసీసీఐ, వైజాగ్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను ఆయా సంస్థల ప్రతినిధులు ఏకే బాలాజీ, సుదర్శనస్వామి, నీజ్, ఆర్‌కే అగర్వాల్ ప్రారంభించారు. ఈ ఎక్స్‌పోలో సుమారు 70 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఆటోమేషన్, మెషిన్ టూల్స్, శాసీ్త్రయ, ల్యాబ్ పరికరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ నెల 29 వరకు ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.


