కొమ్మాది: భీమిలి సాగరతీరంలో బుధవారం సినీ తారలు సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం నగరంలో జరుగుతోంది. ఇందులో భాగంగా భీమిలి బీచ్‌లోని ఒక రిసార్ట్‌తో పాటు మంగమారిపేట, తొట్లకొండ సమీపంలోని తీర ప్రాంతాల్లో ప్రముఖ సినీనటి కాజల్ అగర్వాల్, నటుడు అజయ్ ఘోష్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగ్ కోసం కాజల్ వచ్చారనే విషయం తెలుసుకున్న స్థానికులు, అభిమానులు, పర్యాటకులు ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
అజయ్ ఘోష్


