మహారాణిపేట: జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా వడదెబ్బ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వడదెబ్బపై అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించి సమీక్ష నిర్వహించారు. ప్రమాద ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి, చల్లని తాగునీటి సదుపాయాలు, తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఓఆర్‌ఎస్, మందులు సిద్ధంగా ఉంచాలని, కార్మికులకు మధ్యాహ్న విశ్రాంతి కల్పించాలని తెలిపారు. ప్రజలు ఎండలో తిరగడం తగ్గించి తగిన జాగ్రత్తలు పాటించాలని కోరారు.


