డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 96 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డీవీ రమణమూర్తి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అందిన వినతుల్లో అత్యధికంగా పట్టణ ప్రణాళికా విభాగానికి 60 ఫిర్యాదులు రాగా, ఇంజినీరింగ్ విభాగానికి 14, రెవెన్యూ విభాగానికి 13, ప్రజారోగ్య శాఖకు 5, అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 3, ఉద్యానవన విభాగానికి ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో జీవీఎంసీ జాయింట్ డైరెక్టర్ విజయభారతి, ప్రధాన వైద్యాధికారి నరేష్ కుమార్, సీసీపీ ప్రభాకరరావు, అకౌంట్స్ ఎగ్జామినర్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు, ఏడీహెచ్ వాసుకి, స్పోర్ట్స్ డైరెక్టర్ ఈఏ రాజు, ఆర్‌ఎఫ్‌వో కృపావరం పాల్గొన్నారు.


