విశాఖ స్పోర్ట్స్ : నగరంలో ప్రారంభమైన ఆల్ ఇండియా జోనల్ ఫిజికల్లీ డిసేబుల్డ్ క్రికెట్ టోర్నీలో నార్త్ జోన్, సెంట్రల్ జోన్ జట్లు విజయాలతో ఖాతా తెరిచాయి. సోమవారం ఏసీఏ ఆపరేషన్స్ జీఎం ఎం.ఎస్. కుమార్ ఈ పోటీలను ప్రారంభించారు. తొలి మ్యాచ్‌లో నార్త్ జోన్ 186 పరుగులు చేయగా, లక్ష్య ఛేదనలో సౌత్ జోన్ 168 పరుగులకే పరిమితమైంది. మరో మ్యాచ్‌లో సెంట్రల్ జోన్ 252 పరుగుల భారీ స్కోరు సాధించగా (కేధార్‌నాథ్ 96), వెస్ట్ జోన్ కేవలం 95 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్టేడియం మేనేజర్ జె.కె.ఎం. రాజు, మాజీ కెప్టెన్ గురుదాస్ రౌత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


